Page Loader
Sankranti holidays: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ

Sankranti holidays: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 27, 2024
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల గురించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీ ఈఆర్టీ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి ప్రకటించారు. 2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ఉంటాయని వివరించారు. వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు స్థానిక అధికారులు ఇప్పటికే సెలవులు ప్రకటించినందున, ఈసారి 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లేదా 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని జరుగుతున్న ప్రచారం తప్పు అని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు. ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేసింది.

వివరాలు 

23 సాధారణ సెలవులు,21ఆప్షనల్ హాలిడేస్

మొత్తం షెడ్యూల్ ప్రకారం,23 సాధారణ సెలవులు,21ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయని ఆయన వెల్లడించారు. పండుగ సెలవులు ఇవే.. సంక్రాంతి సెలవులు: 10-01-2025 నుండి 19-01-2025 వరకు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. మైనారిటీ విద్యాసంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు ఉంటాయి.. ఫార్మెటివ్ - సమ్మెటివ్ పరీక్షలు ఫార్మెటివ్ -1(సీబీఏ 1 -8)ఆగస్టు 27 నుంచి 31వరకు ఫార్మెటివ్ -2 అక్టోబర్ 21 నుంచి 25వరకు సమ్మెటివ్ -1 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4వరకు ఫార్మెటివ్ -3(సీబీఏ2)జనవరి 27 నుంచి 31 పదో తరగతి ప్రీఫైనల్ ఫిబ్రవరి 10 నుంచి 20వరకు ఫార్మెటివ్ -4 మార్చి 3 నుంచి 7వరకు సమ్మెటివ్ 2(సీబీఏ 3)ఏప్రిల్ 7 నుంచి 17వరకు