LOADING...
Neet: విడుదలైన నీట్ ఫలితాలు
Neet: విడుదలైన నీట్ ఫలితాలు

Neet: విడుదలైన నీట్ ఫలితాలు

వ్రాసిన వారు Stalin
Jun 04, 2024
08:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

డాక్టర్ కావాలనే కలను నెరవేర్చే నీట్ పరీక్ష ఫలితాలను మంగళవారం NTA విడుదల చేసింది. NEET అభ్యర్థులు exams.nta.ac.in/NEETలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూడొచ్చు. ఫలితాన్ని తనిఖీ చేయడానికి అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌లో వారి ఫోటో బార్ కోడ్‌ను చెక్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల కోసం NEET అధికారిక వెబ్‌సైట్ Exams.nta.ac.in/NEET UG ను సంప్రదించాలి. ఇది కాకుండా.. ఫలితాలను neet.ntaonline.inలో కూడా చూడవచ్చు.

details 

NEET స్కోర్‌కార్డ్‌ను ఎలా తనిఖీ చేయాలి..

1: ముందుగా NTA NEET అధికారిక వెబ్‌సైట్ nta.ac.inకి వెళ్లండి. స్టెప్ 2: ఇప్పుడు హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న NEET 2023 ఫలితాల లింక్ exams.nta.ac.in/NEETపై క్లిక్ చేయండి. స్టెప్ 3: ఇప్పుడు లాగిన్ వివరాలను ఇక్కడ నమోదు చేసి సమర్పించండి. స్టెప్ 4: ఇప్పుడు మీ స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. స్టెప్ 5: స్కోర్‌కార్డ్, డౌన్‌లోడ్ పేజీని తెరిచి.. దానిపై మీ ఫోటో, బార్ కోడ్‌ను తనిఖీ చేయండి

details 

కేటగిరీల వారీగా కట్ ఆఫ్ మార్కులు .

నీట్ ఫలితంతో పాటు, ఆల్ ఇండియా టాపర్స్ పేర్లు, కేటగిరీల వారీగా కట్-ఆఫ్ మార్కులు, శాతం ర్యాంక్‌ను కూడా NTA ప్రకటిస్తుంది. నీట్ యూజీ పరీక్ష మే 5, 2024న జరిగింది. తాత్కాలిక సమాధానాల కీ మే 29న విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణ జూన్ 1, 2024తో ముగిసింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET (UG) - 2024 భారతదేశంలోని 14 నగరాలో 557 కేంద్రాల్లో నిర్వహించారు. 24 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement