Page Loader
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సుప్రీంలో ఊరట.. మైనింగ్ కేసులో బెయిల్ కొనసాగింపు!
వల్లభనేని వంశీకి సుప్రీంలో ఊరట.. మైనింగ్ కేసులో బెయిల్ కొనసాగింపు!

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సుప్రీంలో ఊరట.. మైనింగ్ కేసులో బెయిల్ కొనసాగింపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 02, 2025
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీకి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన అభ్యర్థనపై బుధవారం విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం విచారిస్తూ.. మొదట మైనింగ్ వాల్యూయేషన్ నివేదిక వచ్చాకే తదుపరి చర్యలు చేపడతామని పేర్కొంది. ఈనివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా రూ.195 కోట్ల విలువైన అక్రమ మైనింగ్ జరిగిందని, వాదిస్తూ.. ముందస్తు బెయిల్ ఇవ్వకముందు తమ వాదనలు వినలేదని ఆరోపించారు. నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పిస్తామని ఆయన తెలిపారు. విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 16కి వాయిదా వేసింది.

Details

వంశీ జైలు నుంచి విడుదలకు రంగం సిద్ధం 

ఇదిలా ఉండగా, వల్లభనేని వంశీ బుధవారం విజయవాడ సబ్‌జైల్‌ నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ కేసుల్లో ఆయన 138 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అన్ని కేసుల్లో ఆయనకు ఇప్పటికే బెయిల్ లభించింది. చివరిగా నకిలీ పట్టాల కేసులో నూజివీడు కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. వంశీ విడుదల నేపథ్యంలో జైలు ముందు భారీగా అభిమానులు, వైసీపీ కార్యకర్తలు చేరతారని తెలుస్తోంది. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.