వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనల అనంతరం హైకోర్టు ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు
సీబీఐ విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డిని ఆదేశించిన కోర్టు
విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని సీబీఐని ఆదేశించింది. అలాగే రేపటి నుంచి 25వ తేదీ వరకు సీబీఐ విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డిని ఆదేశించింది.
అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్‌పై 25న తుది తీర్పు వెలువరించనున్నట్లు తెలిపింది.
కాగా, వివేకా కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడంతో సోమవారం, మంగళవారం వాదనలు జరిగాయి. రెండోరోజైన మంగళవారం గంటన్నరకుపైగా కొనసాగాయి.