Garimella Balakrishna Prasad: టీటీడీ ప్రముఖ ఆస్థాన సంగీత విద్వాంసుడు కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ (76) కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం ఆయన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
సంగీత ప్రపంచంలో విశిష్ట స్థానం దక్కించుకున్న ఆయన, వెయ్యికిపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. ప్రత్యేకంగా 'వినరో భాగ్యము విష్ణుకథ', 'జగడపు చనువుల జాజర', పిడికిట తలండ్రాల పెండ్లికూతురు వంటి ప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చారు.
గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ అకాల మృతిపట్ల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీటీడీ ఛైర్మన్ సంతాపం
టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) మృతి
— B R Naidu (@BollineniRNaidu) March 9, 2025
గుండెపోటుతో తిరుపతిలోని స్వగృహంలో మృతి చెందిన గరిమెళ్ల
గరిమెళ్ల కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభుతి
సంప్రదాయ సంగీత ప్రపంచానికి గరిమెళ్ల మృతి తీరని లోటు
టీటీడీ ఆస్థాన విద్వాంసుడుగా గరిమెళ్ల విశేష సేవలందించారు… pic.twitter.com/1rk52djw8W