CR Rao: తెలుగు మూలాలున్న ప్రపంచ గణిత మేథావి సీఆర్ రావు మృతి
భారతదేశానికి చెందిన అమెరికన్ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త, స్టాటిస్టిక్స్‌లో నోబెల్‌గా చెప్పుకునే ఇంటర్నేషన్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు అందుకున్న సీఆర్ రావు, 103ఏళ్ల వయసులో అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశారు. సీఆర్ రావు పూర్తి పేరు కల్యంపూడి రాధాక్రిష్ణ రావు. ఆయన కర్ణాటకలో ఉన్న హడగలి గ్రామంలో తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలో జరిగింది. ఆంధ్య్రా యూనివర్సిటీలో గణితంలో ఎమ్మెస్సీ చేసిన సీఆర్ రావు, ఆ తర్వాత కలకత్తా యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ లో ఎంఏ పూర్తి చేసారు.
భారత ప్రభుత్వం అందించిన పురస్కారాలు
1948లో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం లోని కింగ్స్ కాలేజ్ నుండి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. స్టాటిస్టిక్స్‌లో ఎంతో కృషి చేసిన ఆయన, రావు బ్లాక్ వెల్ థియరీ, క్రామెర్ రావు ఇనిక్వాలిటీ టెక్నిక్‌లను సీఆర్ రావు అభివృద్ధి చేసారు. సీఆర్ రావు సేవలకు గాను భారత ప్రభుత్వం 1968లో ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని అందించింది. ఇంకా, 2001లో పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించింది. అలాగే 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ నుండి మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇటీవల ఆయనకు ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ బహుమతి దక్కింది.