Page Loader
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి 
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2024
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

నగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద గత కొన్ని రోజులుగా గేట్లు మరమ్మతు పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గేట్ల మరమ్మతులు పూర్తియ్యాయి. 67, 69వ గేట్ల వద్ద పాక్షికంగా దెబ్బతిన్న కౌంటర్ వెయిట్‌లను విజయవంతంగా సరి చేశారు. భారీ వర్షాల మధ్య కూడా ఇంజినీర్లు, సిబ్బంది రెండు రోజుల్లోనే ఈ పనిని పూర్తి చేయడం విశేషం. ప్రస్తుతం నదిలో లక్షన్నర క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నా, అధికారులు సాహసోపేతంగా పనిచేసి గేట్లను అమర్చారు. ఈ పనులను కన్నయ్యనాయుడు పర్యవేక్షించారు.

Details

సమస్యను పరిష్కరించిన అధికారులు

గేట్ల మరమ్మతుల కీలక ఘట్టం పూర్తి కావడంతో, అడ్డుగా ఉన్న పడవల తొలగింపు కోసం అధికారులు చర్యలను వేగవంతం చేశారు. ఇటీవలి వరద ఉద్ధృతితో, ప్రకాశం బ్యారేజీకి చేరిన పడవలు (బోట్లు) గేట్లకు అడ్డుతగిలి, ఒకటి కౌంటర్ వెయిట్‌ను ఢీకొట్టింది . 67, 68, 69వ గేట్ల వద్ద రెండు బోట్లు అడ్డుగా పడటంతో వల్ల నీటి ప్రవాహం సక్రమంగా జరగలేదు. దీంతో, అధికారులు త్వరితగతిన మరమ్మతులు చేపట్టి, ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించారు.