
Reuters : ఎక్స్‌లో రాయిటర్స్ ఖాతా బ్లాక్.. కారణం లీగల్ నోటీసేనా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత అంతర్జాతీయ వార్తా ఏజెన్సీ రాయిటర్స్ అధికారిక ఎక్స్ ఖాతా (X handle) భారతదేశంలో నిలిపివేశారు. లీగల్ డిమాండ్ కారణంగా ఖాతాను బ్లాక్ చేసినట్లు సమాచారం. అయితే ఈ పరిణామంపై ఇప్పటివరకు రాయిటర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఆ ఖాతాలో 'లీగల్ డిమాండ్ కారణంగా ఈ కంటెంట్‌ను భారత్‌లో నిలిపివేశారు' అనే సందేశం కనిపిస్తున్నది. ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
Details
ప్రపంచ వ్యాప్తంగా 2,600 మంది సేవలు
ఈ మధ్యలో, రాయిటర్స్‌కు సంబంధించిన ఇతర ఎక్స్ ఖాతాలు రాయిటర్స్ టెక్ న్యూస్, రాయిటర్స్ ఫ్యాక్ట్ చెక్, రాయిటర్స్ పిక్చర్స్, రాయిటర్స్ ఏషియా, రాయిటర్స్ చైనా మాత్రం భారతదేశంలో యథాతథంగా కనిపిస్తున్నాయి. రాయిటర్స్ అనేది థామ్సన్ రాయిటర్స్‌కు చెందిన న్యూస్, మీడియా విభాగం. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 2,600 మంది జర్నలిస్టులు సేవలందిస్తున్నారు.