Loading...
Revanth Reddy: 'జై శ్రీరామ్'పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. జాతీయ రాజకీయాల్లో దుమారం
'జై శ్రీరామ్'పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. జాతీయ రాజకీయాల్లో దుమారం

Revanth Reddy: 'జై శ్రీరామ్'పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. జాతీయ రాజకీయాల్లో దుమారం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 29, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రజల మత, రాజకీయ గుర్తింపులపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో విభజనకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసింది.

వివరాలు 

ఏం జరిగిందంటే..!

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. బీజేపీ నినాదాలపై మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు తరచూ 'జై శ్రీరామ్'నినాదం ఎందుకు చేస్తారని.. అదే విధంగా 'హర హర మహాదేవ్' అని ఎందుకు అనరని ప్రశ్నించారు.

''మేం ద్రావిడులం.ఇక్కడి (ఉత్తర భారతదేశం)ప్రజలు ఆర్యులు. మేం శివ భక్తులం. ఇక్కడి ప్రజలు శ్రీరాముడి భక్తులు.బీజేపీ రాముడిని దొంగిలించింది. అది ఒక భావోద్వేగం. మోదీ గారు'హర హర మహాదేవ్'అని ఎందుకు అనరు? బీజేపీ నేతలు వేదికపై ఆ నినాదం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? వారు కేవలం'జై శ్రీరామ్' అంటారు. మేం 'హర హర మహాదేవ్' అంటే వారికి నచ్చదు'' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

వివరాలు 

తీవ్రంగా స్పందించిన బీజేపీ

శివుడిని 'పేదల దేవుడు'గా.. రాముడిని 'ధనవంతుల దేవుడు'గా ఆయన అభివర్ణించారు.

అయితే ఇద్దరు దేవుళ్లను ప్రజలు ఆరాధిస్తారని కూడా స్పష్టం చేశారు. ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ఉన్న రాజకీయ సంస్కృతి, సామాజిక గుర్తింపుల్లో తేడాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సూచనల మేరకే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను విభజించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు.

ADVERTISEMENT

వివరాలు 

కాంగ్రెస్ పార్టీని 'ఆధునిక ముస్లిం లీగ్ కాంగ్రెస్'

''రాహుల్ గాంధీ సూచనల మేరకు హిందువులను విభజించేందుకు కొత్త మార్గాన్ని కనుగొనే ప్రయత్నంలో భాగంగానే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు'' అని ప్రదీప్ భండారీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

కాంగ్రెస్ పార్టీని 'ఆధునిక ముస్లిం లీగ్ కాంగ్రెస్'గా అభివర్ణించిన ఆయన.. రాముడు, శివుడి అనుచరుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఫలించవని అన్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ పలు మతపరమైన, ఆలయ సంబంధిత కార్యక్రమాలను వ్యతిరేకించిందని భండారీ ఆరోపించారు.

''సోమనాథ్ ఆలయ నిర్మాణాన్ని, కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించిన విషయం దేశం మరిచిపోలేదు. 2018లో 'హర హర మహాదేవ్' అని నినదించినందుకు ముగ్గురు పార్టీ కార్యకర్తలను సస్పెండ్ చేసింది'' అని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ చర్చ

బీజేపీ నేతలు 'హర హర మహాదేవ్' నినాదం చేయరన్న రేవంత్ రెడ్డి వాదనను కూడా భండారీ ఖండించారు.

''ప్రధాని మోదీ 'జై శ్రీరామ్'తో పాటు 'హర హర మహాదేవ్' అని కూడా నినదించే ఏకైక ప్రధానమంత్రి. లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించారని రామాయణంలోని లంకాకాండలో ఉంది. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవారికి ఈ విషయం కూడా తెలియదు'' అని విమర్శించారు.

ఈ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

రాముడు, శివుడిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ చర్చకు కేంద్రంగా మారాయి.

ADVERTISEMENT