
KTR: నిజాలను బయటపెట్టండి.. బండి సంజయ్‌కు కేటీఆర్ కౌంటర్!
ఈ వార్తాకథనం ఏంటి
కరీంనగర్ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన దొంగనోట్ల ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ తమపై ఇలాంటి ఆరోపణలు చేయడం విచిత్రమని వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్, "మీరు ఒక కేంద్రమంత్రిగా ఉండి మమ్మల్ని దొంగనోట్ల ముద్రణలోకి లాగుతున్నారు.
అయితే కర్ణాటకలో అధికారంలో మీరే ఉన్నారు కదా? అప్పుడు ఎందుకు దర్యాప్తు చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. నేతలకు నిరాధార ఆరోపణలు చేయడం అలవాటైపోయిందని ఆయన ఆరోపించారు.
Details
దక్షిణాది రాష్ట్రాలను ఒకే వేదికపైకి తేస్తాం
దేశంలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ (డీలిమిటేషన్) చేయకూడదన్నదే తమ పార్టీ స్పష్టమైన విధానమని కేటీఆర్ తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. అందుకే, ఈ సమస్యను చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాల సదస్సులో పాల్గొన్నామని వివరించారు.
బీజేపీ అసలు ఎజెండాను బహిర్గతం చేయడానికి, దక్షిణాది రాష్ట్రాలను ఒకే వేదికపైకి తేనేందుకు తమ పార్టీ కృషి చేస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ కొత్త భవనంలో అన్ని సీట్లను లెక్క ప్రకారం ఏర్పాటు చేశారు. కానీ అసలు సమస్య ఏమిటంటే, బీజేపీ ఉత్తరాదిలో, ముఖ్యంగా అస్సాం, జమ్ముకాశ్మీర్‌లో సీట్లు పెంచుతూనే ఉంది. కానీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు.
Details
అన్యాయాన్ని అడ్డుకోవాలి
దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే విషయమే కాదు.
మొదటిగా మనం భారతీయులం. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.