Page Loader
Household Consumer Expenditure Survey: దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం.. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ముందంజ 
దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం.. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ముందంజ

Household Consumer Expenditure Survey: దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం.. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ముందంజ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2025
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

మారుతున్న జీవనశైలితో ప్రజలు అన్నం వినియోగాన్ని కొంతవరకు తగ్గించి, గోధుమలు, జొన్నలు, రాగులు ఇతర చిరుధాన్యాలపై దృష్టి పెడుతున్నా, దేశంలోని 20 రాష్ట్రాల్లో ఇప్పటికీ బియ్యమే ప్రధాన ఆహారంగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 నివేదిక స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు నెలకు సగటున 4.629 కేజీల బియ్యం వినియోగిస్తున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే, తెలంగాణ నెలకు తలసరి 8.4215 కేజీల వినియోగంతో 9వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 7.9185 కేజీలతో 12వ స్థానంలో ఉంది. దక్షిణాదిలో బియ్యం వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈ రెండు ముందున్నాయి.

Details

 గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య తేడా

వీటి తరువాత తమిళనాడు 14వ స్థానం, కేరళ 18వ స్థానం, కర్ణాటక 20వ స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 5.065 కేజీల బియ్యం వినియోగం ఉండగా, పట్టణాల్లో 4.193 కేజీలు ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల వినియోగం పట్టణాల కంటే 21% అధికంగా ఉంది. తెలంగాణలో ఈ తేడా 23శాతం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 9.299 కేజీలు, పట్టణాల్లో 7.544 కేజీలు చొప్పున వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంత వినియోగం 7.481 కేజీలు, పట్టణాల్లో 8.356 కేజీలు, మొత్తం సగటున 7.9185 కేజీలు ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో బియ్యం వినియోగం అత్యధికంగా ఉంది.

Details

కనీస వినియోగం ఉన్న రాష్ట్రాలు 

మణిపుర్, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రజలు నెలకు 1 కేజీ బియ్యం కూడా వినియోగించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కిలో బియ్యం సగటున రూ.29, తెలంగాణలో రూ.31 ఖర్చవుతోందని నివేదిక వెల్లడించింది.