Telangana: తెలంగాణలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రెండురోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి పోలిస్తే 4.2 డిగ్రీల పెరుగుదలతో 34.3 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదైంది. ఖమ్మం జిల్లాలో 3.7 డిగ్రీల పెరుగుదలతో 33 డిగ్రీల,మహబూబ్‌నగర్‌లో 2.8 డిగ్రీల పెరుగుదలతో 34.4 డిగ్రీల,నిజామాబాద్‌లో 2.1 డిగ్రీల పెరుగుదలతో 33.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు,శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణానికి కంటే తగ్గాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలుగా నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో 8.7,సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 8.8,రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 9.8, పెద్దపల్లి జిల్లా రామగిరి 10 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదయ్యాయి.
వివరాలు
పెరగనున్న చలి..
13 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10.1 నుంచి 10.9 డిగ్రీల మధ్య ఉన్నాయి, మరికొన్ని జిల్లాల్లో 2 నుంచి 5.4 డిగ్రీల వరకు తగ్గుదల కనిపించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రాబోయే మూడు రోజులలో రాష్ట్రంలో చలి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి పోలిస్తే 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గవచ్చని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చలిని గమనించవచ్చని సూచన ఇచ్చింది.