
Chilakaluripeta: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆరుగురు ప్రయాణీకుల దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట జాతీయ రహదారిపై నిన్న మధ్యాహ్నం 1.30 కి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యు వాత పడ్డారు.
అతి వేగంగా వస్తున్న టిప్పర్- ఓ ప్రవేట్ బస్సును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రయాణీకులు చని పోయారు.
వాహనాలు ఢీకొనగానే ఒక్కసారిగా మంటలు రేగాయి. దీంతో అప్రమత్తమైన రెండు వాహనాల డ్రైవర్లు బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
చిలకలూరిపేట సమీపంలోని ఈవూరి పాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది వున్నారు.
Details
గాయపడిన ప్రయాణీకులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో..
వీరంతా మే 13 న ముగిసిన పోలింగ్ లో పాల్గొని హైదరాదాద్ తిరుగు ప్రయాణంలో వున్నారు.
వీరిలో ఎక్కువ మంది బాపట్ల జిల్లా చినగంజాం, గొనసపూడి, నీలాయ పాలెంకు చెందిన గ్రామస్ధులని పర్చూరు పోలీసులు తెలిపారు.
మంటల్లో చిక్కుకు పోయిన వారిని కాపాడటానికి 108 వాహనం కోసం ఫోన్ చేశారు.
తక్షణమే స్పందించిన పోలీసులు ,గాయపడిన ప్రయాణీకులను 108 వాహనంలో చిలకలూరి పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
మంటలను ఆపేందుకు చిలకలూరిపేట నుంచి వచ్చిన అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.