MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
దిల్లీ మద్యం కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్టు విచారించింది. తన కుమారులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వారిపట్ల తల్లిగా బాధ్యతలు నెరవేర్చాలని, అందుకు తనకు బెయిల్ కావాలని కోరుతూ కవిత బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్నువిచారించిన రౌస్ ఎవెన్యూ కోర్టు ఈడీ, కవిత తరఫున సుదీర్ఘ వాదనలు వింది. కవితకు మధ్యంతర బెయిల్,లేదా రెగ్యులర్ బెయిల్ రెండింటిలో ఏది కావాలో నిర్ణయించుకోవాలని ధర్మాసనం కవిత తరఫు లాయర్ అభిషేక్ మను సింఘ్వీని అడిగింది.
తదుపరి విచారణనుఈనెల 4 వ తేదీకి వాయిదా
తదుపరి విచారణను ఈనెల 4 వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈడీ రిప్లై రిజాయిన్డర్‌కు తమకు సమయం కావాలని, ఈనెల 3 తేదీ సాయంత్రంలోగా రిజాయండర్ వేస్తామని అభిషేక్ సింఘ్వీ ధర్మాసనానికి వెల్లడించింది. దీనికి కోర్టు అందుకు అనుమతించింది. కాగా దీనిపై విచారణను ఈనెల 4 వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.