Hyderabad: హైదరాబాద్‌లో పట్ట'పగలు' దారుణం.. కత్తితో పొడిచి యువకుడి హత్య
ఈ వార్తాకథనం ఏంటి
పాత ద్వేషాలు,కక్షల నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీసింది. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బహిరంగంగా జరిగిన ఈ కత్తిపోట్ల సంఘటన స్థానికులను ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది. బాలానగర్ ఏసీపీ నగేష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డినగర్‌కు చెందిన రోషన్‌సింగ్(25) రౌడీషీటర్. జగద్గిరిగుట్ట పరిధి సోమయ్యనగర్‌కు చెందిన బాలశౌరెడ్డి(23)కూడా పాత నేరస్థుడే. సుమారు 15రోజులక్రితం రోషన్‌సింగ్ ఆరుగురితో కలిసి ఓ ట్రాన్స్‌జెండర్‌ని మాట్లాడుకుని రంగారెడ్డినగర్‌లోని ఓ నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తరువాత డబ్బుల విషయంలో వచ్చిన గొడవతో,బాధితురాలు బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో రోషన్ & అతని గ్యాంగ్‌పై కేసు నమోదు చేయించింది. తమపై కేసు పెట్టాలని ట్రాన్స్‌జెండర్‌ను బాలశౌరెడ్డి పురమాయించి ఉంటాడని రోషన్ అనుమానం పెంచుకున్నాడు.అతన్ని ఎలాగైనా చంపుతానని స్నేహితులతో అనేవాడు.
వివరాలు
కత్తితో విచక్షణా రహితంగా పొడిచిన బాలశౌరెడ్డి
అది కాస్తా బాలశౌరెడ్డి చెవిన పడింది. 'రోషన్ నన్ను చంపడమేంటి.. నేనే వాడిని చంపేస్తాన'ని మిత్రులతో బాలశౌరెడ్డి అనేవాడు. బుధవారం సాయంత్రం రోషన్‌సింగ్, బాలశౌరెడ్డి, వారి స్నేహితులు ఆదిల్, మహ్మద్ కలిసి మద్యం సేవించారు. అనంతరం జగద్గిరిగుట్ట చివరి బస్టాప్ వద్ద పాత విషయాలు తలెత్తడంతో మాటల గొడవ తీవ్రరూపం దాల్చింది. ఇదే సమయంలో మహ్మద్ రోషన్‌ను బలంగా పట్టుకోగా, బాలశౌరెడ్డి చేతిలోని కత్తితో అనేక సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. తరువాత అక్కడే సిద్ధంగా ఉన్న బైకుపై ఆదిల్‌తో కలిసి పరారయ్యాడు.
వివరాలు
పోలీసులు అదుపులో స్నేహితుడు 'మనూ'
కత్తిపోట్ల వల్ల తీవ్రంగా గాయపడిన రోషన్‌సింగ్‌ను ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ చివరికి ప్రాణం కోల్పోయాడు. సంఘటన సమయంలో అక్కడే ఉన్న మరో స్నేహితుడు 'మనూ'ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.