LOADING...
Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.1,618 కోట్లు విడుదల: రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ప్రకటన
ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.1,618 కోట్లు విడుదల: రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ప్రకటన

Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.1,618 కోట్లు విడుదల: రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2025
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటివరకు మొత్తం రూ.1,618 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వి.పి. గౌతమ్‌ బుధవారం ఒక పత్రిక ప్రకటనలో వెల్లడించారు. లబ్ధిదారులలో ఎవరి ఖాతాకు బిల్లు జమ కాకుండా ఉంటే,ఆ ఖాతా నంబరుకు ఆధార్‌ ను అనుసంధానం చేయాల్సిందిగా ఆయన సూచించారు. ఇప్పటివరకు పునాది స్థాయిలో ఉన్న1,21,076 ఇళ్లకు రూ.1,210.76 కోట్లు,గోడల స్థాయిలో ఉన్న 25,264 ఇళ్లకు రూ.252.64 కోట్లు, శ్లాబ్‌ పూర్తి చేసుకున్న 7,772 నివాసాలకు రూ.155.44 కోట్లను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశాం' అని గౌతమ్‌ వెల్లడించారు. ఈ ప్రక్రియ ద్వారా ఇళ్లు నిర్మాణంలో ఉన్న లబ్ధిదారులకు ఆర్థిక సహాయం సమయానికి అందిస్తూ, ప్రాజెక్ట్‌ విజయవంతంగా ముందుకు సాగుతోంది అని గౌతమ్‌ తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.1,618 కోట్లు విడుదల