Ponnam: శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల సాయం.. ఉద్యోగం హామీ : మంత్రి పొన్నం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 24, 2026
05:07 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శంకర్ గౌడ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. అదేవిధంగా ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లు కూడా అందజేస్తామని వెల్లడించారు. శంకర్ గౌడ్ అంత్యక్రియలు సజావుగా పూర్తయ్యేలా జేఏసీ నేతలు చొరవ తీసుకోవాలని మంత్రి కోరారు.
వివరాలు
ఇలాంటి సమయాల్లో రాజకీయాలు చేయకూడదు
ఈ విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయకూడదని విపక్షాలకు ఆయన సూచించారు. ఇక మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.