PM Modi: రూ.15,200 కోట్ల జీపీఆర్‌ఏ ప్రాజెక్ట్.. దిల్లీలో మెట్రో కొత్త లైన్లను ప్రారంభించిన మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దిల్లీలో భారీ గృహ, మౌలిక వసతుల ప్రాజెక్టును ప్రారంభించారు. సుమారు రూ. 15,200 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామోడేషన్ (GPRA) పునర్వికాస పథకంలో భాగంగా అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా నిర్మించిన 2,722 ఫ్లాట్లను ప్రారంభించడంతో పాటు మరిన్ని 6,632 ఫ్లాట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Details
7 పాత ప్రభుత్వ కాలనీల పునర్వికాసం
ఈ ప్రాజెక్టు ద్వారా ఢిల్లీలోని పాత ప్రభుత్వ నివాస కాలనీలను ఆధునికంగా అభివృద్ధి చేయనున్నారు. పునర్వికాసం చేపట్టనున్న కాలనీలు ఇవి: సరోజినీ నగర్, నేతాజీ నగర్, నౌరోజీ నగర్, కస్తూర్బా నగర్, త్యాగరాజ్ నగర్, శ్రీనివాసపురి, మహ్మద్‌పూర్ సుమారు 537 ఎకరాల విస్తీర్ణంలో ఈ పునర్వికాసం చేపడుతున్నారు. పాత తక్కువ అంతస్తుల భవనాలను తొలగించి, వాటి స్థానంలో ఆధునిక హై-రైజ్ నివాస సముదాయాలు నిర్మించనున్నారు.
Details
ప్రభుత్వ ఉద్యోగులకు గృహాల కొరత నివారణ
ఈ ప్రాజెక్టు ద్వారా 21 వేలకుపైగా కొత్త నివాస యూనిట్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న కాలనీల్లోని అనేక క్వార్టర్లు చాలా పాతవి కావడంతో సుమారు 40% నివాసాలు నివసించడానికి అనర్హంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న 20 వేలకుపైగా గృహాల కొరతను తీర్చడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ఉంది. స్వయం సమీకరణ మోడల్‌లో పునర్వికాసం ఈపునర్వికాసం సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ ద్వారా చేపడుతున్నారు. దీనికి ప్రజా నిధులు అవసరం ఉండదు. మొత్తం ప్రాజెక్టు ప్రాంతంలో 69.41ఎకరాల భూమిని కమర్షియల్, రెసిడెన్షియల్ వినియోగానికి మోనిటైజ్ చేయనున్నారు. ద్వారా సుమారు రూ. 35,100 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఇది ప్రాజెక్టు అంచనా వ్యయం అయిన రూ. 32,800 కోట్లను కవర్ చేస్తుంది.
Details
దిల్లీ మెట్రో కొత్త కారిడార్లకు కూడా ప్రారంభం
మార్చి 8న ప్రధాని మోదీ దిల్లీ మెట్రోకు చెందిన రెండు కొత్త కారిడార్లను కూడా ప్రారంభించనున్నారు. మజ్లిస్ పార్క్ - మౌజ్‌పూర్ బాబర్‌పూర్ (పింక్ లైన్) : సుమారు 12.3 కిలోమీటర్లు దీపాలి చౌక్ - మజ్లిస్ పార్క్ (మెజెంటా లైన్) సుమారు 9.9 కిలోమీటర్లు ఈ కొత్త మార్గాల ద్వారా బురారి, జగత్పూర్-వజీరాబాద్ తదితర ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ మెరుగుపడనుంది.