NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Assam: అస్సాంలో రూ.22,000 కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్..  ముఖ్యమంత్రి హెచ్చరిక 
    తదుపరి వార్తా కథనం
    Assam: అస్సాంలో రూ.22,000 కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్..  ముఖ్యమంత్రి హెచ్చరిక 
    అస్సాంలో రూ.22,000 కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్

    Assam: అస్సాంలో రూ.22,000 కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్..  ముఖ్యమంత్రి హెచ్చరిక 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 04, 2024
    12:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అసోంలో రూ. 22 వేల కోట్ల భారీ కుంభకోణం వెలుగు చూసింది. అసోం రాష్ట్ర పోలీసులు ఈ కుంభకోణం గుట్టు రట్టు చేశారు.

    స్టాక్‌మార్కెట్ పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసగించిన వారు భారీ మొత్తంలో డబ్బు చోరీ చేశారు.

    ఈ కేసులో, దిబ్రూగఢ్‌కు చెందిన 22ఏళ్ల వ్యాపారి విశాల్ ఫుకాన్, గౌహతికి చెందిన స్వప్నిల్ దాస్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

    ఈ కుంభకోణంలో మరిన్ని అరెస్టులు జరగవచ్చని పోలీసులు తెలిపారు. ఫుకాన్ తన సంపన్న జీవనశైలిని ఉపయోగించి ప్రజలను ఆకర్షించాడని,60 రోజుల్లో 30 శాతం రాబడి వస్తుందని ప్రజలను మభ్యపెట్టాడని పేర్కొన్నారు.

    నాలుగు నకిలీ కంపెనీలను స్థాపించి, అస్సామీ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి, పలు ఆస్తులు సంపాదించాడని గుర్తించారు.

    వివరాలు 

    పరారీలో అస్సామీ కొరియోగ్రాఫర్

    దిబ్రూగఢ్‌లోని ఫుకాన్ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించి, స్కామ్‌కు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

    అస్సామీ కొరియోగ్రాఫర్ సుమీ బోరా కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు.

    ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రజలను మోసపూరిత ఆన్‌లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల నుండి దూరంగా ఉండాలని కోరారు.

    తక్కువ ప్రయత్నంతో డబ్బు రెట్టింపు చేస్తామన్న చేస్తామంటే.. అవన్నీ మోసపూరితమైనవే అని తెలిపారు.

    "ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థల ద్వారా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే సరికొత్త వ్యవస్థ లేదని ప్రజలకు తెలియజేయాలని చెప్పాలనుకుంటున్నాను. మోసగాళ్లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నాను. అక్రమ పెట్టుబడులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రయత్నిస్తాం" అని సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అస్సాం/అసోం
    హిమంత బిస్వా శర్మ

    తాజా

    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం
    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్

    అస్సాం/అసోం

    కారు ప్రమాదంలో అసోం 'లేడీ సింగం' జున్మోని రభా మృతి; సీఐడీ విచారణ రోడ్డు ప్రమాదం
    అసోంలోని సోనిత్‌పూర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం మణిపూర్
    అసోం: కారు- వ్యాను ఢీ, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం  గువాహటి
    గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    హిమంత బిస్వా శర్మ

    ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ అస్సాం/అసోం
    'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్ బీజేపీ
    నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత అస్సాం/అసోం
    కూరగాయల ధరల పెరుగుదలపై అసోం సీఎంకు ఓవైసీ స్ట్రాంగ్ రిప్లే అస్సాం/అసోం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025