తదుపరి వార్తా కథనం

Kishan Reddy: తెలంగాణలో జాతీయ రహదారుల కోసం రూ.31 వేల కోట్లు కేటాయింపు
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 12, 2025
12:54 pm
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారుల అభివృద్ధికి సుమారు రూ.31 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు.
ఈ విషయాన్ని ఆదివారం 'ఎక్స్'లో పోస్ట్ చేసి ఆయన తెలిపారు. 'రాష్ట్రంలో 2,722 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయింది. .
Details
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు
మరొక 2,526 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా ఉన్నతీకరించాం.
భారతమాల ప్రాజెక్టు తొలి దశలో రూ.38,297 కోట్ల భారీ బడ్జెట్‌తో రాష్ట్రవ్యాప్తంగా 1,719 కిలోమీటర్ల జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నాం.
దీని ద్వారా ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందేలా చేస్తుందని కిషన్ రెడ్డి తన పోస్ట్‌లో పేర్కొన్నారు