LOADING...
Polavaram: ఆర్టీఏ లింక్‌తో మోసం.. ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.12 లక్షలు గల్లంతు!
ఆర్టీఏ లింక్‌తో మోసం.. ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.12 లక్షలు గల్లంతు!

Polavaram: ఆర్టీఏ లింక్‌తో మోసం.. ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.12 లక్షలు గల్లంతు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈ ఏకంగా ఏకంగా ఓ ఎమ్మెల్యేను బురిడి కొట్టించారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజును లక్ష్యంగా చేసుకుని మోసం చేసి, ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.12 లక్షలు దోచుకున్నారు. ఆర్టీఏ చలానా పేరుతో వచ్చిన ఓ అనుమానాస్పద లింక్‌ను ఎమ్మెల్యే క్లిక్ చేయడంతో సైబర్ మోసగాళ్లు బ్యాంకు ఖాతాకు యాక్సెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే ఖాతాలోని మొత్తం నగదును మాయంచేశారు. తాను మోసపోయిన విషయం గుర్తించిన వెంటనే ఎమ్మెల్యే బాలరాజు స్పందించి, జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement