Dubai: భారతీయ ఉపాధ్యాయురాలు రూబుల్ నాగీకి ప్రపంచస్థాయి అవార్డు
ఈ వార్తాకథనం ఏంటి
విద్య అంటే కేవలం తరగతి గదిలో మాత్రమే బోధించడం కాదు, పాఠశాలకు రాలేని పిల్లలకూ అదే అవకాశాలు అందేలా చేయాలి అని నమ్మి, ఆ దిశగా సమర్ధవంతంగా ప్రయత్నించిన భారతీయ ఉపాధ్యాయురాలు రూబుల్ నాగీకి అంతర్జాతీయ స్థాయి గౌరవం లభించింది. దుబాయ్‌లో గురువారం నిర్వహించిన వరల్డ్ గవర్నమెంట్స్ సమిట్‌లో ఆమెను గ్లోబల్ టీచర్ ప్రైజ్-2025తో సన్మానించారు. ఈ పురస్కారం భాగంగా రూబుల్ నాగీకి వర్కీ ఫౌండేషన్ 10 లక్షల డాలర్లు (సుమారు 9 కోట్లు) నగదు బహుమతిగా అందజేశారు.
వివరాలు
వెనుకబడిన వర్గాల పిల్లల కోసం సుమారు 800 అభ్యసన కేంద్రాల ఏర్పాటు
రూబుల్ నాగీ ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోసం సుమారు 800 అభ్యసన కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే, వివిధ సబ్జెక్ట్‌లకు సంబంధించిన చిత్రలేఖనాల ద్వారా గోడలను తరగతి గదుల్లా మార్చి, పిల్లలకు ఆసక్తికరమైన, సృజనాత్మక వాతావరణాన్ని కలిగించారు. తనకు లభించిన నగదు బహుమతిని ఉపయోగించి, రూబుల్ నాగీ విద్యార్థులకు ఉచిత వృత్తి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టే సంకల్పంతో ఉన్నారు.