భారత్ అమెరికా సంబంధాలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇరు దేశాల మైత్రికి హద్దుల్లేవని ప్రకటన
భారత్ - అమెరికా బంధంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య మైత్రికి హద్దుల్లేవన్నారు. రెండు దేశాల రిలేషన్స్ కు పరిమితులు విధించడం కష్టమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జై శంకర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు వాషింగ్టన్‌లోని భారతీయులతో కేంద్రమంత్రి భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే అమెరికాతో భారత్‌కున్న స్నేహంపై మాట్లాడారు. ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగినా, ఈ రెండు దేశాలు మాత్రం మంచి భాగస్వాములుగా మెలగడం మన కళ్లెదుటే కనిపిస్తుందన్నారు. ఈ బంధం అంచనాలకు మించిపోయిందన్నారు. ఇరు దేశాలు పరస్పర సహకారం, అవసరాలు, విశాల దృక్ఫథంతో మెలుగుతున్న దృష్ట్యా సరికొత్త రంగాల్లోనూ కలిసి పని చేస్తామని జైశంకర్ ధీమా వ్యక్తం చేశారు.