Page Loader
ఇక భారత్‌లోనే యుద్ధవిమానాల ఇంజిన్‌ల తయారీ; GE ఏరోస్పేస్- HAL మధ్య ఒప్పందం
ఇక భారత్‌లోనే యుద్ధవిమానాల ఇంజిన్‌ల తయారీ; GE ఏరోస్పేస్- HAL మధ్య ఒప్పందం

ఇక భారత్‌లోనే యుద్ధవిమానాల ఇంజిన్‌ల తయారీ; GE ఏరోస్పేస్- HAL మధ్య ఒప్పందం

వ్రాసిన వారు Stalin
Jun 22, 2023
07:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్‌లను ఉత్పత్తి చేసేందుకు అమెరికాకు చెందిన GE ఏరోస్పేస్‌ - హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌( HAL) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ Mk2 యుద్ధవిమానాల్లో జీఈ ఏరోస్పేస్‌‌కు చెందిన F414 ఇంజిన్‌లను అమర్చనున్నారు. కొత్త ఒప్పందం ప్రకారం, భారతదేశంలోనూ వీటిని ఉత్పత్తి చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది. భారతదేశంలో F414 ఇంజిన్ల ఉత్పత్తి ఉమ్మడిగా ఉంటుందని జనరల్ ఎలక్ట్రిక్(GE) ఏరోస్పేస్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ విషయంలో అమెరికా ప్రభుత్వం అనుమతులు తీసుకోవాల్సి ఉందని వెల్లడించింది.

యుద్ధ విమానాలు

80 శాతం సాంకేతికత బదిలీకి అంగీకరించిన జనరల్ ఎలక్ట్రిక్

రాబోయే కొద్ది సంవత్సరాల్లో 400 కంటే ఎక్కువ ఇంజిన్లను తయారు చేసి ఎగుమతి చేయాలని భావిస్తున్నారు. జనరల్ ఎలక్ట్రిక్(GE) ఏరోస్పేస్‌ సీఈఓ హెచ్ లారెన్స్ కల్ప్ జూనియర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చలు అనంతరం దాదాపు 80 శాతం సాంకేతికతను బదిలీ చేసేందుకు అంగీకరించింది. ఇంజిన్‌లు మొదట లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజాస్ Mk2 యుద్ధవిమానాలకు అమర్చనున్నారు. ఆ తర్వాత ట్విన్ ఇంజిన్ బేస్డ్ ఫైటర్, చివరికి అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ Mk1 యుద్ధ విమానాలకు వీటిని ఉపయోగించనున్నారు. ఈ ఒప్పందంతో అమెరికాతో భారత్ రక్షణ సహకారాన్ని బలోపేతం చేసేందుకు కొత్త మార్గాలను తెరిచాయి.