Loading...
Sabarimala: శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి శబరి పోర్టల్‌, చాట్‌బాట్
శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి శబరి పోర్టల్‌, చాట్‌బాట్

Sabarimala: శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి శబరి పోర్టల్‌, చాట్‌బాట్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

అయ్యప్ప భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో చేపట్టే మండల-మకరవిళక్కు యాత్రలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం శబరిమలలో యాత్రికుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు అత్యవసర సేవలు అందించడంతోపాటు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలియజేసేందుకు ఈసారి ప్రత్యేకంగా శబరి పోర్టల్‌,వాట్సప్‌ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. యాత్రికులకు సంబంధించిన సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం వీటిని రూపొందించింది. దర్శనం, రవాణా, వసతి, వైద్య సేవలు, అత్యవసర సదుపాయాలను పొందేందుకు ఈ పోర్టల్‌ ఉపయోగపడనుంది. పంబ, నీలక్కల్‌, సన్నిధానం ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాల వివరాలను కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు.

వివరాలు 

పోర్టల్‌ ద్వారా అధికారులకు ఫిర్యాదు

వివిధ సేవల కోసం వేర్వేరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని వివరాలు ఒకే వేదికపై లభిస్తాయని అధికారులు వెల్లడించారు.

యాత్ర సమయంలో ఎవరైనా తప్పిపోయినా, వ్యక్తిగత వస్తువులు పోగొట్టుకున్నా పోర్టల్‌ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

ఈ సమాచారం నేరుగా పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది. ఫిర్యాదుపై అధికారులు తీసుకున్న చర్యల వివరాలను వాట్సప్‌ ద్వారా భక్తులకు తెలియజేస్తారు.

దీంతో యాత్రికులకు అవసరమైన సహాయం త్వరగా అందే అవకాశం ఉంటుంది.

వివరాలు 

పోర్టల్‌ ద్వారా అధికారులకు ఫిర్యాదు

అంతేకాకుండా తాగునీటి కేంద్రాలు, మరుగుదొడ్లు, వైద్య కేంద్రాలు, పార్కింగ్‌ స్థలాలు, విశ్రాంతి భవనాలు, ఏటీఎంలు ఎక్కడెక్కడ ఉన్నాయో పోర్టల్‌లో తెలుసుకోవచ్చు.

గూగుల్‌ మ్యాపుల సాయంతో ఆయా ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. రైళ్లు, బస్సుల రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని కూడా పొందవచ్చు.

వివిధ వస్తువులకు ప్రభుత్వం నిర్ణయించిన అధికారిక ధరలను సైతం పలు భాషల్లో చూసుకునే సదుపాయం కల్పిస్తున్నారు.

ఈ కొత్త డిజిటల్‌ సేవలతో శబరిమల యాత్రికులకు సమాచార సేకరణ, అత్యవసర సేవలు పొందడం మరింత సులభం కానుంది.

ADVERTISEMENT