Telangana: హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు.. ఇక దున్నపోతుల సందడి నెక్స్ట్ లెవెల్!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో సదర్ పేరు వింటే, నగరంలో ఒక ప్రత్యేక వైబ్రేషన్ అనిపిస్తుంది. ఆ వైబ్రేషన్‌ను మరింత ఉల్లాసంగా మార్చడానికి సదర్ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత భాగ్యనగరంలో యాదవులు నిర్వహించే సదర్ ఉత్సవాలు ఈసారి నెక్ట్స్ లెవెల్‌లో జరగనున్నాయి. నగరంలోని సైదాబాద్, నారాయణగూడ, అమీర్‌పేట్, ఖైరతాబాద్, షేక్‌పేట్ ప్రాంతాల్లో సదర్ సంబరం ఘనంగా సాగనుంది. ముషీరాబాద్ సదర్ ఉత్సవ నిర్వాహకులు ఎడ్ల హరిబాబు నేతృత్వంలో హర్యానా నుంచి గోలు-2, రోలెక్స్, కోహినూర్, బజరంగీ వంటి భారీ దున్నపోతులను తీసుకొచ్చారు. ఈ దున్నపోతులు ముర్రా జాతికి చెందినవే.
Details
ఒక్కో దున్నపోతు 12 అడుగుల పొడవు
ఒక్కో దున్నపోతు 12 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. వీటికి ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్, పాలు, పళ్లు అందిస్తారు. అలాగే, ఆయిల్ మసాజ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈసారి గోలు-2 ప్రత్యేక ఆకర్షణగా ఉండనుందని నిర్వాహకులు తెలిపారు. ఇక కాళీ దున్నరాజు గురించి చెప్పుకుంటే, ఇది 31 వేల రూపాయల విలువ కలిగిన రాయల్ సెల్యూట్ ఫుల్ బాటిల్‌ని ఒకేసారి లాగించేస్తాది. ఈ సదర్ ఉత్సవాలు దరువాలా మధు యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 22న ఘనంగా జరగనున్నాయి. అందుకు ప్రత్యేకంగా ఆల్ ఇండియా ఛాంపియన్ గుమాం కాళీ అనే 25 కోట్ల రూపాయల విలువ కలిగిన దున్నరాజు తీసుకొచ్చారు.
Details
నార్సింగ్ కూడా సదర్ ఉత్సవాలు
అలాగే రంగారెడ్డి జిల్లా నార్సింగిలో కూడా సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. హైదరాబాద్ పాతబస్తీ చంచల్ గూడ్ రోడ్‌లో యాదవ సంఘం ఏర్పాటు చేసిన సదర్ మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 200 పైగా దున్నపోతులు ఈ మేళాలో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు.