తదుపరి వార్తా కథనం

Sajjanar: హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సజ్జనార్ నియామకం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 27, 2025
09:18 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి కొత్త బాధ్యతలు కేటాయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సజ్జనార్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా శిఖా గోయల్ నియమించారు. ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారుసింహాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతిలక్రాకు అదనపు బాధ్యతలు కేటాయించారు. ఇక ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి నియమితులయ్యారు. అంతేగాక ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్ కొత్త బాధ్యతలు స్వీకరించారు.