అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి, గైడ్ టీచర్ అరుదైన ఘనత సాధించారు. వీరు తయారు చేసిన ఓ నమూనా అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపిక ఏకైక ప్రాజెక్టు ఇదేకావడం గమనార్హం. షేక్ పైజన్ సంగారెడ్డి జిల్లాలోని గమ్మడిదల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. గైడ్ టీచర్ శోభారాణి సహకారంతో అటవీ జంతువుల నుంచి పంటలను రక్షించే నమూనాను ఫైజాన్ తయారు చేశారు. ఈ నమూన అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటోంది. తొలుత ఫైజాన్ తన నమూనాను స్కూల్ స్థాయిలో ప్రదర్శించారు. అది రాష్ట్ర, నేషనల్ స్థాయికి ఎంపికైంది.
భువనేశ్వర్‌లో ఐఎంఎంటీ విశ్వవిద్యాలయంలో నమూనా ప్రదర్శన
2022 నవంబర్‌లో ఫైజాన్ తన నమూనాను అసోంలోని గుహవాటిలో జాతీయ స్థాయి వైజ్ఞానిక మేళాలో ప్రదర్శించారు. అక్కడ శోభారాణి, ఫైజాన్ ప్రశంసలు అందుకున్నారు. ఇదే క్రమంలో శోభారాణి, ఫైజాన్ తయారు చేసిన ప్రాజెక్టు రాష్ట్రం తరపున జీ20 సదస్సుకు ఎంపికైంది. రాష్ట్రం నుంచి జీ20 సదస్సుకు ఎంపికైన ఏకైక ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఐఎంఎంటీ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న సదస్సులో నమూనాను ప్రదర్శనకు ఉంచారు.