Page Loader
ఈడీ చీఫ్ పదవీకాలాన్ని మూడోసారి పొడిగించడం చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు
ఈడీ చీఫ్ పదవీకాలాన్ని మూడోసారి పొడిగించడం చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు

ఈడీ చీఫ్ పదవీకాలాన్ని మూడోసారి పొడిగించడం చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Stalin
Jul 11, 2023
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని మూడవసారి పొడిగించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. అయితే, జులై చివరి వరకు పదవిలో కొనసాగడానికి సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. దర్యాప్తు సంస్థకు కేంద్రం కొత్త చీఫ్‌ని నియమించాలని స్పష్టం చేసింది. ఎస్‌కే మిశ్రా పదవీ కాలం పొడిగించడం అనేది 2021లో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. సంజయ్ కుమార్ మిశ్రా 1984వ బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. నవంబర్ 2023లో పదవీ విరమణ చేయనున్నారు.

ఈడీ

2018 నవంబర్‌లో ఈడీ చీఫ్‌గా మిశ్రా నియామకం

నవంబర్ 2018లో మిశ్రా తొలిసారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్‌గా రెండేళ్ల కాలవ్యవధికి నియమితులయ్యారు. ఈ పదవీకాలం నవంబర్ 2020లో ముగిసింది. నవంబర్ 13, 2020న, 'రెండేళ్ల' కాలాన్ని 'మూడేళ్ల' కాలానికి మార్చే విధంగా రాష్ట్రపతి 2018లో జారీ చేసిన ఉత్తర్వును సవరిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఆర్డర్లు జారీ చేసింది. దీనిని కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. 2021, సెప్టెంబరలో ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు కేంద్రం సవరణను ఆమోదించింది. అయితే మూడోసారి మిశ్రాకు పదవీకాలాన్ని పొడగించాడానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.