తదుపరి వార్తా కథనం
Sankranthi Holidays: రేపటి నుండి స్కూళ్లకు నుంచి సంక్రాంతి సెలవులు.. 18న పునఃప్రారంభం
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 10, 2025
12:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో సంక్రాంతి పండుగ సందడి ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇవాళ సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఎందుకంటే రేపటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు కాబట్టి. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి పాఠశాలలకు వచ్చి, వేడుకల్లో పాల్గొన్నారు.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు.
జనవరి 18న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించి, 17న మళ్లీ తెరవనున్నారు.
సెలవు దినాల్లో తరగతులు నిర్వహించకూడదని ఇంటర్మీడియట్ బోర్డు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను హెచ్చరించింది.
నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.