Page Loader
Special Trains: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త.. సంక్రాంతికి స్పెషల్‌ ట్రైన్స్‌.. నేటి నుంచి బుకింగ్స్‌
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త.. సంక్రాంతికి స్పెషల్‌ ట్రైన్స్‌.. నేటి నుంచి బుకింగ్స్‌

Special Trains: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త.. సంక్రాంతికి స్పెషల్‌ ట్రైన్స్‌.. నేటి నుంచి బుకింగ్స్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, హైదరాబాద్‌ నుంచి కాకినాడకు ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. పండుగ రద్దీ నేపథ్యంలో ఆరు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. కాచిగూడ-కాకినాడ టౌన్‌, హైదరాబాద్‌-కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక రైలు సేవలను అందించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10, 11, 12 తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్ల కోసం టికెట్‌ రిజర్వేషన్‌ బుకింగ్‌ జనవరి 2వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ తెలిపారు.

వివరాలు 

కాచిగూడ - కాకినాడ టౌన్‌ రైలు (07653): 

ఈ రైలు జనవరి 9, 11 తేదీల్లో రాత్రి 8:30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్‌ - కాచిగూడ రైలు (07654) జనవరి 10, 12 తేదీల్లో సాయంత్రం 5:10 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.

వివరాలు 

హైదరాబాద్‌ - కాకినాడ టౌన్‌ రైలు (07023): 

ఈ రైలు జనవరి 10న సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7:10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07024) జనవరి 11న రాత్రి 8 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్ల ద్వారా ప్రయాణిస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది.