Page Loader
AP Govt : సంక్రాంతి బహుమతిగా నామినేటెడ్‌ పదవుల భర్తీకి సర్కార్‌ సిద్దం!
సంక్రాంతి బహుమతిగా నామినేటెడ్‌ పదవుల భర్తీకి సర్కార్‌ సిద్దం!

AP Govt : సంక్రాంతి బహుమతిగా నామినేటెడ్‌ పదవుల భర్తీకి సర్కార్‌ సిద్దం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2024
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో కూటమి పార్టీల నేతలకు కొత్త సంవత్సరం ప్రారంభంలోనే నామినేటెడ్‌ పదవుల బహుమతులు అందనున్నాయి. సహకార సంస్థలు, మార్కెట్‌ కమిటీల పదవులను జనవరి నెలలో భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు దాదాపు 10 వేల పదవులు క్షేత్రస్థాయి నేతలకు కేటాయించనున్నారు. వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే ముందు వాటికి నామినేటెడ్‌ పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,300 వ్యవసాయ సహకార సొసైటీలున్నాయి. వాటిలో ఒక్కో సొసైటీకి చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నామినేట్‌ చేయడం ద్వారా మొత్తం 6,900 మందికి అవకాశాలు కల్పించనున్నారు.

Details

వ్యవసాయేతర సంఘాల పదవులు భర్తీ చేసేందుకు కసరత్తు

వాటిలో రిజర్వేషన్లు ప్రత్యేకంగా లేకపోయినా, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సామాజిక న్యాయం పాటించాలని సర్కారు సూచించింది. నియామక ప్రక్రియను ఎమ్మెల్యేలు అందజేసిన ప్రతిపాదనల ఆధారంగా ఖరారు చేసే బాధ్యతను ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించారు. సంక్రాంతి నాటికి ఈ నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రెండో దశలో జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెట్‌ కమిటీలకు కూడా ముగ్గురు సభ్యుల పాలక వర్గాలను నియమిస్తారు. తర్వాత రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండలి నియామకంపై నిర్ణయం తీసుకుంటారు. జిల్లాస్థాయి పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించారు. సహకార సంస్థల్లో వ్యవసాయేతర సంఘాల పదవులు కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Details

రిజర్వేషన్ ఉన్న పదవులు జనరల్ గా మారుతాయి

మత్స్యకార సొసైటీలకు నామినేటెడ్‌ పాలక వర్గాల నియామకంపై సహకార శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నియామకాలను కూడా జనవరి నెలలోనే పూర్తి చేసే అవకాశం ఉంది. గొర్రెల పెంపకందారుల సొసైటీల పాలక వర్గాల నియామకంపై కూడా ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పాలక వర్గాల నియామక ప్రక్రియ ప్రస్తుతం ప్రభుత్వ స్థాయిలో కొనసాగుతోంది. రాష్ట్రంలో 222 మార్కెట్‌ కమిటీలకు చైర్మన్‌తో కలిపి 15 మంది సభ్యులను నియమించనున్నారు. వాటిలో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రొటేషన్ పద్ధతిలో రెండేళ్ల తరువాత రిజర్వేషన్‌లో ఉన్న పదవులు జనరల్‌గా మారుతాయి, ఇక ప్రస్తుతం జనరల్‌లో ఉన్నవి రిజర్వేషన్‌లోకి వస్తాయి.