
Satyavedu TDP MLA :సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. వీడియోలు రిలీజ్ చేసిన బాధితురాలు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ టీడీపీ మహిళా నేత ఒకరు గురువారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా, ఆమె కోనేటి ఆదిమూలంతో కలిసి ఉన్న అనైతిక దృశ్యాలను కూడా విడుదల చేశారు.కుటుంబాన్ని నాశనం చేస్తానంటూ బెదిరించి, తనను శృంగారంలో పాల్గొనటానికి బలవంతం చేశారని ఆ మహిళ ఆరోపించారు.
ఆమె కథనం ప్రకారం,తానూ టీడీపీలో ఉంటానని..కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే కావడంతో పలుమార్లు కలిశామని,ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని బెదిరించారన్నారు.
తనపై చేసిన లైంగిక వేధింపులను పెన్ కెమెరా ఉపయోగించి రికార్డు చేసినట్లు తెలిపారు.
ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు, లోకేష్‌లకు లేఖ రూపంలో తెలియజేశానని ఆమె వివరించారు.
వివరాలు
చర్యలు తీసుకునేందుకు టీడీపీ హైకమాండ్ రెడీ
కోనేటి ఆదిమూలం మొదట వైఎస్ఆర్‌సీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి,రెండు సార్లు ఆ పార్టీ తరపున పోటీ చేశారు.
2014లో ఓటమి చవిచూశారు,కానీ 2019లో భారీ మెజార్టీతో విజయం సాధించారు.
అనంతరం ఆయన టీడీపీలో చేరి,ఆ పార్టీ నుంచి సత్యవేడు నియోజకవర్గం తరపున పోటీచేసి విజయం సాధించారు.
ఈ ఉదంతం సంచలనంగా మారడంతో, కోనేటి ఆదిమూలం మీడియాతో మాట్లాడారు. ఈ వీడియోలను టీడీపీ నేతలు కుట్ర పూరితంగా విడుదల చేశారని, వీడియోలలో ఉన్న మహిళను తాను ఎప్పుడూ చూడలేదని,అవి మార్ఫింగ్ చేశారని వ్యాఖ్యానించారు.
తనపై జరుగుతున్న ఆరోపణలు టీడీపీలో ఉన్న కొంతమంది నాయకుల కుట్ర అని ఆయన ఆరోపించారు.
ఈ ఘటన పలు చర్చలకు దారితీస్తోంది.టీడీపీ అధినాయకత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.