Loading...
Saurav Das: 'లండన్ వెళ్లకుండా అడ్డుకున్నారు'.. కేంద్రంపై సీజేబీ నేత సౌరవ్ దాస్ విమర్శలు
'లండన్ వెళ్లకుండా అడ్డుకున్నారు'.. కేంద్రంపై సీజేబీ నేత సౌరవ్ దాస్ విమర్శలు

Saurav Das: 'లండన్ వెళ్లకుండా అడ్డుకున్నారు'.. కేంద్రంపై సీజేబీ నేత సౌరవ్ దాస్ విమర్శలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు బ్రిటన్‌ వెళ్లాలనుకున్న తనను ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేబీ) సహ-కన్వీనర్ సౌరవ్ దాస్ ఆరోపించారు. 'కాక్రోచ్ ఉద్యమం' గురించి ప్రసంగించేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి తనకు ఆహ్వానం అందిందని ఆయన వెల్లడించారు. సోమవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సౌరవ్ దాస్ వరుస పోస్టుల ద్వారా వెల్లడించారు. లండన్ వెళ్లే విమానం ఎక్కేందుకు తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌కు వెళ్లినట్లు తెలిపారు. అక్కడ తన పాస్‌పోర్ట్‌ను ఫ్లాగ్ చేసినట్లు అధికారులు చెప్పారని పేర్కొన్నారు.

వివరాలు 

కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది: సౌరవ్ దాస్

ఆక్స్‌ఫర్డ్,కేంబ్రిడ్జ్,ఎల్‌ఎస్‌ఈ (LSE),ఎడిన్‌బర్గ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రసంగించే అవకాశాల కోసం భారతీయ విద్యార్థులు ఎంతో శ్రమించి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.

అలాంటి కార్యక్రమానికి వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం తనను అడ్డుకుందని విమర్శించారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ నిర్వహించే చర్చాగోష్టిలో పాల్గొనేందుకు తాను లండన్ పర్యటనకు సిద్ధమైనట్లు సౌరవ్ దాస్ వివరించారు.

చదువుకున్న యువత అంతర్జాతీయ స్థాయిలోని మేధావులతో చర్చలు జరపడాన్ని చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వంటి వ్యక్తులైతే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

వివరాలు 

స్పందించిన అభిజీత్ డిప్కే

ఈ ఘటనతో తన ప్రయాణాలు ఆగిపోవని స్పష్టం చేశారు. భవిష్యత్తులో లండన్, పారిస్‌తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా తప్పకుండా వెళ్తానని తెలిపారు.

మరోవైపు, ఈ వ్యవహారంపై సీజేబీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే స్పందించారు.

సౌరవ్ దాస్‌కు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందడాన్ని చూసి అధికారంలో ఉన్న కొందరు అసూయపడుతున్నారని ఆరోపించారు.

విద్యావంతుల గొంతును నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీజేబీ విమర్శించింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సౌరవ్ దాస్ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT