Loading...
Supreme Court: 'ఫారమ్‌ 6'లో మార్పుపై ఎంపీ పిటిషన్‌.. ఈసీకి సుప్రీం నోటీసులు

Supreme Court: 'ఫారమ్‌ 6'లో మార్పుపై ఎంపీ పిటిషన్‌.. ఈసీకి సుప్రీం నోటీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2026
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)ప్రక్రియలో ఓటరు నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని ఆరోపిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దోలా సేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం..ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. SIR ప్రక్రియలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ ఇప్పటికే పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యుల ఆమోదం లేకుండానే కొన్ని మార్పులు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఈ నేపథ్యంలో దోలా సేన్ తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. అయితే,ఈ ప్రక్రియను రాజ్యాంగం కల్పించిన అధికారాల పరిధిలో, చట్ట నిబంధనలకు అనుగుణంగానే చేపట్టామని ఎన్నికల సంఘం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది.

వివరాలు 

చట్టానికి విరుద్ధంగా ఉన్నట్లు తేలితే.. రద్దు

ఫారం-6లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. SIR ప్రక్రియలో భాగంగా ప్రవేశపెట్టిన డిక్లరేషన్ పత్రం ఫారం-6కు వేరని వివరించింది.

దరఖాస్తుదారులు ఓటరుగా నమోదు కావడానికి అర్హులా కాదా అనే విషయాన్ని పరిశీలించడంతోపాటు,వారి వివరాలను గత ఓటర్ల జాబితాతో సరిపోల్చేందుకే ఆ పత్రాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది.

SIR అమలుకు సంబంధించిన ఉత్తర్వులకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని కూడా ఎన్నికల సంఘం వెల్లడించింది.

మరోవైపు, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తామని, అవి చట్టానికి విరుద్ధంగా ఉన్నట్లు తేలితే వాటిని రద్దు చేస్తామని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది.

ADVERTISEMENT