Page Loader
Patanjali: తప్పుదోవ పట్టించే యాడ్స్ ఆపకుంటే జరిమానా విధిస్తాం: పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక 
Patanjali: తప్పుదోవ పట్టించే యాడ్స్ ఆపకుంటే జరిమానా విధిస్తాం: పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక

Patanjali: తప్పుదోవ పట్టించే యాడ్స్ ఆపకుంటే జరిమానా విధిస్తాం: పతంజలికి సుప్రీంకోర్టు హెచ్చరిక 

వ్రాసిన వారు Stalin
Nov 21, 2023
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి(Patanjali)కి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆధునిక వైద్య విధానాలకు వ్యతిరేకంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్‌ ప్రచురిస్తున్న పతంజలి(Patanjali) సంస్థను జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మందలించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే పతంజలి యాడ్స్‌కు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పతంజలి గ్రూప్‌ను హెచ్చరించింది. తప్పుడు ప్రకటనలు పతంజలి ఆయుర్వేదం తక్షణమే నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

కోర్టు

ఒక్కో ఉత్పత్తిపై కోటి రూపాయల జరిమానా విధిస్తాం: ధర్మాసనం

తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే అవసరమైతే జరిమానాను కూడా విధిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఒక్కో ఉత్పత్తిపై కోటి రూపాయల జరిమానా కూడా విధిస్తామని జస్టిస్ అమానుల్లా వివరించారు. పతంజలి(Patanjali) ఆయుర్వేద సంస్థ నుంచి భవిష్యత్‌లో తప్పుడు ప్రకటనలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అల్లోపతి వర్సెస్ ఆయుర్వేదం చర్చకు పతంజలి సంస్థ కారణం కాకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సమస్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కోర్టు చెప్పింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆచరణీయమైన పరిష్కారాన్ని కనుగొనవలసి ఉంటుందని భారత అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్‌కు ధర్మాసనం సూచించింది. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తగిన సిఫార్సులు సమర్పించాలని కోరారు.