కర్ణాటక: బురఖా ధరించలేదని బస్సు ఎక్కనివ్వని ఆర్టీసీ డ్రైవర్
కర్ణాటక కలబురగిలో ఓ ఆర్టీసీ డ్రైవర్ తీరు ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. బుర్ఖాలు ధరించలేదని ముస్లిం విద్యార్థినులను బస్సు ఎక్కించడానకి ఆ డ్రైవర్ నిరాకరించాడు. దీంతో తోటి ప్రయాణికులు, స్థానికులు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కమ్లాపూర్ తాలూకాలోని ఓకలి గ్రామం నుంచి బసవకల్యాణ్‌కు పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు బస్టాండ్‌కు రాగా, అక్కడ డ్రైవర్ వారిని అడ్డుకున్నాడు. బస్సు ఎక్కే ముందు ముస్లిం బాలికలందరూ బురఖాలు ధరించాలని డిమాండ్ చేశాడు. ముస్లీం విద్యార్థులకు బురఖాలు మాత్రమే ఆమోదయోగ్యమని, హిజాబ్ కాదని డ్రైవర్ చెప్పాడు. హిజాబ్ ధరించిన వారిని బస్సుకు ఎక్కకుండా అడ్డుకున్నాడు. బురఖా ధరించలేదని డ్రైవర్ తమను బస్సు ఎక్కించలేదని ఓ విద్యార్థిని ఆరోపించింది. డ్రైవర్ తమ మతపరమైన గుర్తింపును ప్రశ్నించాడని పేర్కొంది.