LOADING...
Special Trains: తిరుపతి - షిరిడి మధ్య 18 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే!
తిరుపతి - షిరిడి మధ్య 18 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే!

Special Trains: తిరుపతి - షిరిడి మధ్య 18 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2025
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా,దక్షిణ మధ్య రైల్వే తిరుపతి, సాయినగర్‌ శిర్డీ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య మొత్తం 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలు ఆగస్టు 3వ తేదీ నుండి సెప్టెంబర్‌ 29వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి.

వివరాలు 

ప్రత్యేక రైళ్ల షెడ్యూల్‌ ఇలా ఉంది: 

తిరుపతి → శిర్డీ (07637): ఈ రైలు ప్రతి ఆదివారం ఉదయం 4:00 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, తరువాతి రోజు సోమవారం ఉదయం 10:45 గంటలకు శిర్డీకి చేరుకుంటుంది. ఈ సర్వీసు ఆగస్టు 3 నుండి సెప్టెంబర్‌ 28 వరకూ అందుబాటులో ఉంటుంది. శిర్డీ → తిరుపతి (07638): శిర్డీ నుంచి బయలుదేరే ఈ రైలు ప్రతి సోమవారం రాత్రి 7:35 గంటలకు నడుపబడుతుంది. ఇది తరువాతి రోజు మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటలకు (తెల్లవారితే బుధవారం) తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు ఆగస్టు 4 నుండి సెప్టెంబర్‌ 29 వరకు సేవలందిస్తుంది.

వివరాలు 

ఈ ప్రత్యేక రైళ్ల ఆగే స్టేషన్లు ఇలా ఉన్నాయి: 

రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌, లింగంపల్లి, వికారాబాద్‌, జహీరాబాద్‌, బీదర్‌, భాల్కి, ఉద్గిర్‌, లాతూర్‌ రోడ్‌, పర్లి, గంగఖేర్‌, పర్భని, సేలు, జాల్నా, ఔరంగాబాద్‌, నాగర్‌సోల్‌, మన్మాడ్‌, కోపర్‌గావ్‌. కోచ్‌ల వివరాలు: ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్‌ ఎసీ (2AC), థర్డ్‌ ఎసీ (3AC), స్లీపర్‌ క్లాస్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉన్నాయి. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీటిని ఏర్పాటు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తిరుపతి - షిరిడి మధ్య 18 ప్రత్యేక రైళ్లు