LOADING...
Ram V Sutar: 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' రూపశిల్పి రామ్ సుతార్ కన్నుమూత 

Ram V Sutar: 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' రూపశిల్పి రామ్ సుతార్ కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత భారతీయ శిల్పి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్ వి. సుతార్ (100) ఈ ప్రపంచాన్ని వీడారు. వయోసంబంధమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఆయన నోయిడాలోని కుమారుడి నివాసంలో చివరి శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విశేషం ఏమిటంటే,గుజరాత్‌లోని ప్రసిద్ధ 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ',హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కి సంబంధించిన పెద్ద విగ్రహాలను రూపకల్పన చేసిన శిల్పి రామ్ సుతార్. 1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని గోందూర్ గ్రామంలో సాధారణ విశ్వకర్మ కుటుంబంలో ఆయన జన్మించారు. తన ప్రతిభా వైభవంతో శిల్పకళలో ఎత్తులను అధిరోహించారు. ఆయన సృష్టించిన అనేక కళాఖండాలు దేశవ్యాప్తంగా గుర్తింపుని పొందాయి.

వివరాలు 

హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహాల రూపశిల్పి 

ముఖ్యంగా, గుజరాత్‌లో నర్మదా నదీ తీరంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ గౌరవార్థం నిర్మించిన 182 మీటర్ల 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చింది. అలాగే, హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహాన్ని కూడా ఆయన రూపొందించారు. శిల్పకళా రంగంలో చేసిన సేవలకు భారత ప్రభుత్వం 1999లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఆయన మరణంపై పలువురు రాజకీయ, కళారంగ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Advertisement