తదుపరి వార్తా కథనం

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 29, 2025
11:14 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి 6.86 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. దీని కారణంగా 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి, 6.86 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద రెండో స్థాయి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణమ్మ నది ఉగ్రరూపం దాల్చడం వల్ల బెరంపార్క్ రూమ్స్ వైపునకు కూడా నీరు చేరుతోంది. మరోవైపు, వరద ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని ఆదివారమే టూరిజం శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పర్యాటక ప్రాంతాల్లో బోట్లను డ్రైవర్లతో తాళ్లతో కట్టి భద్రత కట్టుబెట్టారు. జిల్లా అధికారులు నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి, ఎవరూ ప్రమాద ప్రాంతానికి వెళ్లకూడదని, అలాగే నదిలో స్నానం చేయవద్దని చెప్పారు.