Manipur: మణిపూర్‌లో భద్రతా బలగాలు-కుకీల ఘర్షణ.. రోడ్ల మూసివేతపై ఉద్రిక్తత
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చిన తర్వాత మైయిటీ, కుకీ మిలిటెంట్లు ఆయుధాలను సమర్పిస్తున్న పరిస్థితుల్లో, కుకీలు భద్రతా బలగాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.
ఈరోజు భద్రతా బలగాలు, కుకీల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేక పరిపాలన డిమాండ్ నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరగకూడదని కుకీలు ఆందోళన చేస్తున్నారు.
'ఫ్రీ మూమెంట్'ను అడ్డుకునేందుకు వారు ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. భద్రతా బలగాల రక్షణలో రాష్ట్రంలోని జిల్లాల్లో బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.
ఇంఫాల్‌కు 45 కి.మీ దూరంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో భద్రతా బలగాలను అడ్డుకునే ప్రయత్నంలో కుకీ తెగకు చెందిన మహిళలపై లాఠీచార్జ్ జరిగింది.
Details
రెండేళ్ల క్రితం మొదలైన ఘర్షణలు
ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా రహదారి దిగ్భంధనాలను నిషేధించగా, కుకీలు నిరసనగా రాళ్లు రువ్వడం, రోడ్లను తవ్వడం, టైర్లను కాల్చడం, బారికేడ్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలకు దిగారు.
రెండేళ్ల క్రితం మైయిటీ, కుకీల మధ్య ప్రారంభమైన జాతి ఘర్షణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ హింసలో 250 మంది మరణించగా, 50,000 మంది నిరాశ్రయులయ్యారు.
SoO ఒప్పందంపై సంతకం చేసిన కుకీ మిలిటెంట్ గ్రూపులు, నాయకులు తమకు ప్రత్యేక పరిపాలన కల్పించే వరకు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగనీయమని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.