LOADING...
Hashim Musa Encounter: 'టీ82' సిగ్నల్‌తో మొదలై.. మూడు గంటల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు!
'టీ82' సిగ్నల్‌తో మొదలై.. మూడు గంటల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు!

Hashim Musa Encounter: 'టీ82' సిగ్నల్‌తో మొదలై.. మూడు గంటల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2025
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడి ప్రధాన నిందితుడు సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసాను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్‌ను వారు కేవలం మూడు గంటల వ్యవధిలో విజయవంతంగా ముగించారు. శ్రీనగర్ సమీపంలోని మహాదేవ్ పర్వత ప్రాంతంలో అతడి కదలికలను గుర్తించిన వెంటనే దళాలు మెరుపువేగంతో స్పందించాయి. మొదట రాత్రి ఆయన కమ్యూనికేషన్‌ యాక్టివిటీని గుర్తించి.. ఉదయం ఉగ్రవాదుల కదలికలను నేరుగా గమనించి.. సమీపానికి చేరుకుని కాల్పులతో ముగించారు.

Details

అల్ట్రాసెట్‌' సిగ్నల్స్‌తో ఆపరేషన్‌కు శ్రీకారం

శ్రీనగర్‌లోని 13,000 అడుగుల ఎత్తున్న మహాదేవ్ పర్వత శ్రేణుల్లో ఆదివారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో చైనా తయారీ 'టీ82' ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌ సెట్‌ నుంచి సంకేతాలు వస్తున్నట్టు గుర్తించిన భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇదే కమ్యూనికేషన్ పరికరాన్ని పహల్గాం ఉగ్రదాడిలోనూ ఉపయోగించినట్టు సమాచారం. లొకేషన్ డాచిగామ్ నేషనల్ పార్క్ పరిసరంగా ఉన్నట్టు స్పష్టమైంది. డ్రోన్లతో ముష్కరుల క్యాంప్ గుర్తింపు ఉదయం 8 గంటలకు భద్రతా దళాలు డ్రోన్లను ఉపయోగించి ఆ దట్టమైన అడవిని జల్లెడ పట్టాయి. 9.30కి రాష్ట్రీయ రైఫిల్స్‌, పారా ఎస్‌ఎఫ్‌ కమాండోలు మహాదేవ్ హిల్స్ వైపు వెళ్లారు. చెట్లతో నిండిన ప్రాంతాన్ని సవాళ్లతో కూడిన మార్గాల్లో దాటి కమాండోలు శత్రువు సమీపానికి చేరుకున్నారు.

Details

సమయంతో పాటే మెరుపుదాడి.. ముగిసిన 'ఆపరేషన్ మహాదేవ్'

11 గంటలకు కమాండోలు టెర్రరిస్టుల పొజిషన్‌ను చేరుకుని మొదటి కాల్పుల్లోనే ముగ్గురిని తూటాలతో గాయపరిచారు. వారిలో ఒకడు 11.45కి పరారయ్యేందుకు ప్రయత్నించగా మరొకసారి కాల్పులు జరిపారు. మిగిలిన ప్రాంతంలో ఎవరైనా మిగిలి ఉన్నారేమోనని 12.45 వరకు విస్తృత గాలింపు చేపట్టారు. భారీ ఆయుధాలు స్వాధీనం ఎన్‌కౌంటర్‌ అనంతరం మృతదేహాలను గుర్తించిన భద్రతా దళాలు ఉగ్రవాదుల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అమెరికా తయారీ ఎం-4 కార్బైన్, ఏకే-47 రైఫిల్స్, 17 రైఫిల్ గ్రనేడ్లు, పెద్ద సంఖ్యలో బులెట్లు, చైనా కమ్యూనికేషన్ పరికరాలు ఉన్నాయి. ఈ ముష్కరులు భవిష్యత్‌లో మరిన్ని ఉగ్రదాడులకు సిద్ధమవుతున్నారని అనుమానిస్తున్నారు. ఇది భారత భద్రతా వ్యవస్థ యొక్క అప్రమత్తతకు, వేగవంతమైన స్పందనకు నిదర్శనంగా నిలిచింది.