LOADING...
Amonium Nitrate: రాజ‌స్థాన్‌లో 150 కిలోల అమోనియం నైట్రేట్ సీజ్‌.. ఇద్ద‌రు అరెస్టు
రాజ‌స్థాన్‌లో 150 కిలోల అమోనియం నైట్రేట్ సీజ్‌.. ఇద్ద‌రు అరెస్టు

Amonium Nitrate: రాజ‌స్థాన్‌లో 150 కిలోల అమోనియం నైట్రేట్ సీజ్‌.. ఇద్ద‌రు అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2025
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లో భారీ మొత్తంలో పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని టోంక్ జిల్లాలో అనుమానాస్పదంగా కదులుతున్న ఓ కారును అధికారులు పట్టుకున్నారు. ఆ మారుతీ కారులో సుమారు 150 కిలోల అమోనియం నైట్రేట్‌ను తరలిస్తున్నట్లు గుర్తించారు. యూరియా బస్తీల్లో దాచిపెట్టి ఈ పేలుడు పదార్థాన్ని తీసుకెళ్తున్నట్టు సమాచారం. అదే సమయంలో, ఈ వాహనం నుంచి సుమారు 200 ఎక్స్‌ప్లోసివ్ బ్యాటరీలు, దాదాపు 1100 మీటర్ల పొడవైన వైరు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరిని సురేంద్రగా, మరో వ్యక్తిని సురేంద్ర మోచీగా గుర్తించారు. ఈ కేసుపై ప్రస్తుతం పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

150 కిలోల అమోనియం నైట్రేట్ సీజ్

Advertisement