LOADING...
Jubilee Hills BYE Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భద్రతా కట్టుదిట్టం.. పోలింగ్ ప్రారంభం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భద్రతా కట్టుదిట్టం.. పోలింగ్ ప్రారంభం

Jubilee Hills BYE Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భద్రతా కట్టుదిట్టం.. పోలింగ్ ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 11, 2025
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills BYE Election) ఈరోజు మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు కఠినమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 6:30 గంటలకు మాక్ పోలింగ్ కూడా ప్రారంభమై, ఎన్నికల సరళిని పరీక్షించారు. ఈ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 144 సెక్షన్లలో పోలింగ్ నిర్వహించబడుతోంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడానికి ఈసీ అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఉప ఎన్నిక కోసం మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది, రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల అధికారులు కీలక అంక్షలు విధించారు.

Details

407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాట్లు

ఏవైనా అంక్షలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నాలుగు లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించనున్నారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీ చేస్తున్నారు. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఉప ఎన్నికకు 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. భద్రత పరంగా కూడా అత్యధిక ఏర్పాట్లు ఉన్నాయి. 2,400 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా పారమిలిటరీ కేంద్ర బలగాలు పహరా వహిస్తున్నాయి. రహమత్‌నగర్, బోరబండ, యూసఫ్‌గూడా, శ్రీరామ్‌నగర్ వంటి సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.

Details

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఈ కేంద్రాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మొత్తం 800 మంది కేంద్ర బలగాలు విధుల్లో ఉన్నారు. 139 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పోలింగ్ పరిస్థితులను ఈసీ అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అంతేకాక, నవోదయా కాలనీ పీఎస్ నంబర్ 290లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కును వినియోగించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా చురుకైనంగా ఓటు హక్కు వినియోగించాలని కోరుతున్నారు.

Advertisement