NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రశాంతత కోసం పెద్దమ్మతల్లి గుడికి వచ్చి మరోసారి శేజల్ ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలింపు
    తదుపరి వార్తా కథనం
    ప్రశాంతత కోసం పెద్దమ్మతల్లి గుడికి వచ్చి మరోసారి శేజల్ ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలింపు
    మరోసారి శేజల్ ఆత్మహత్యాయత్నం

    ప్రశాంతత కోసం పెద్దమ్మతల్లి గుడికి వచ్చి మరోసారి శేజల్ ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలింపు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 29, 2023
    07:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శేజల్ వివాదం ముదురుతోంది. ఆరిజిన్‌ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్‌ మరోసారి బలవన్మరణానికి ఒడిగట్టారు.

    ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి సమీపంలో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

    హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు బాధితురాలిని ఆటోలో ఆస్పత్రికి తరలించారు.

    అనంతరం విచారణలో భాగంగా శేజల్‌ బ్యాగ్‌లో పలు నిద్రమాత్రలు, ఓ లేఖను పోలీసులు గుర్తించారు.

    మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో శేజల్ ను పెద్దమ్మ గుడి వద్ద ఎవరో దిగబెట్టారని స్థానికులు అంటున్నారు.

    గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ తీవ్రమైన లైంగిక ఆరోపణలు చేస్తున్నారు.

    details

    న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు 

    బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అతని మీద చర్యలు తీసుకోవాలని ఇటీవలే మహిళా కమిషన్‌, హెచ్ఆర్సీకి శేజల్ కంప్లైంట్ చేశారు.

    అనంతరం దిల్లీలో ఉన్న తెలంగాణభవన్‌ వద్ద మనస్థాపంతో ఆత్మహత్యకు యత్నించారు.

    ప్రస్తుతం హైదరాబాద్ లో శేజల్‌ నిద్రమాత్రలు మింగి మరోసారి బలవన్మరణానికి యత్నించినట్టు పోలీసులు భావిస్తున్నారు,

    లైంగికంగా వేధించిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని దిల్లీలో అధికార పార్టీ ఎంపీని కలిస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడేమో చిన్నయ్య వేధింపులపై తగిన ఆధారాలు లభించలేదని అంటున్నట్లు సమాచారం.

    తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని, ఎప్పుడు హత్య చేస్తారో తెలియని భయంతో బతుకుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Mongolia: అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. మంగోలియా ప్రధాని రాజీనామా  మంగోలియా
    Bhu Bharati: 'ప్రజల వద్దకే రెవెన్యూ నినాదం'.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి తెలంగాణ
    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి

    హైదరాబాద్

    ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల తెలంగాణ
    హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా? తెలంగాణ
    ఎండల నుంచి ఉపశమనం; మరో మూడు రోజులు వర్షాలు తెలంగాణ
    హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు; 10వేల మందికి ఉద్యోగాలు  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025