Page Loader
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వీడియో విడుదల.. జాతీయ మహిళా కమిషన్ లో శేజల్ ఫిర్యాదు 
మందు తాగాలని బలవంతపెట్టారంటున్న శేజల్

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వీడియో విడుదల.. జాతీయ మహిళా కమిషన్ లో శేజల్ ఫిర్యాదు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 08, 2023
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా బాధితురాలను చిన్నయ్యకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేయడం రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అయితే ఇప్పటికే తనకు న్యాయం చేయాలని శేజల్ దిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ తలుపు తట్టారు. ఎమ్మెల్యే తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని కమిషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. స్పందించిన మహిళా కమిషన్‌ తమ ఎదుట హాజరకావాలని శేజల్‌కు సమాచారం ఇచ్చింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్‌ ముందు ఆమె హాజరయ్యారు. బెల్లంపల్లి శాసనసభ్యుడు తనను లైంగికంగా వేధిస్తూ మందు తాగాలని బలవంతం చేశాడని గత కొద్ది రోజులుగా దుమారం రేగుతోంది.

Details

పోలీసులు ఆధారాలను ధ్వంసం చేశారు : శేజల్ 

బిజినెస్ మీట్ కి రావాలని పిలిచిన దుర్గం చిన్నయ్య, అక్కడ మందు పార్టీ ఏర్పాటు చేశాడని శేజల్ ఆరోపిస్తోంది. మరోవైపు ఆర్థిక లావాదేవీల విషయంలో ఆరిజన్ డైయిరీ యాజమాన్యమే స్థానిక రైతులను మోసం చేసిందనే నెపంతో తనపై ఎమ్మెల్యే తప్పుడు కేసులు పెట్టించారన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు నమోదుకు స్థానిక ఠాణాలో శేజల్ ఫిర్యాదు చేసింది. అప్పట్నుంచి ఎమ్మెల్యే అనుచరులు తనను వేధిస్తున్నారని శేజల్ భయాందోళన వ్యక్తం చేస్తోంది. పోలీసులు సైతం చిన్నయ్యకే వత్తాసు పలుకుతున్నారని, అందుకే తన వద్ద దాచిన ఎవిడెన్స్ లను డిలీట్‌ చేశారని చెప్పుకొచ్చింది. ఎమ్మెల్యే అరాచకాలపై తన వద్ద మరిన్ని ఆధారాలు భద్రంగా ఉన్నాయని శేజల్‌ స్పష్టం చేసింది.