LOADING...
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సంచలనం.. 22 మంది అధికారులపై వేటు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సంచలనం.. 22 మంది అధికారులపై వేటు

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సంచలనం.. 22 మంది అధికారులపై వేటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 13, 2026
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్‌లో నాసిరకం రా మెటీరియల్ వినియోగంపై వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్లాంట్‌లో ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలు దెబ్బతినడానికి నాసిరకం ముడి పదార్థాల వినియోగమే ప్రధాన కారణమని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాణ్యత పరీక్షల నిర్వహణలో అధికారులు రాజీ పడ్డారన్న ఆరోపణలను యాజమాన్యం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న వేళ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 22 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు

రానున్న మరిన్ని కఠిన చర్యలు

ఈ చర్య స్టీల్ ప్లాంట్ వర్గాల్లో సంచలనంగా మారింది. సస్పెన్షన్‌కు గురైన అధికారుల్లో ఎస్‌ఎంఎస్‌-1, ఎస్‌ఎంఎస్‌-2 విభాగాలతో పాటు క్వాలిటీ అష్యూరెన్స్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ (QATD)లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అధికారులు ఉన్నట్లు సమాచారం. నాణ్యత నియంత్రణ ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాలపై యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు జనరల్ మేనేజర్లు (జీఎంలు), నలుగురు డిప్యూటీ జనరల్ మేనేజర్లు (డీజీఎంలు) బదిలీకి గురయ్యారు. బాధ్యుల నిర్ధారణ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Advertisement