Page Loader
ED: బెట్టింగ్ యాప్ కేసు‌లో సంచలనం.. గూగుల్‌, మెటాకు ఈడీ నోటీసులు!
బెట్టింగ్ యాప్ కేసు‌లో సంచలనం.. గూగుల్‌, మెటాకు ఈడీ నోటీసులు!

ED: బెట్టింగ్ యాప్ కేసు‌లో సంచలనం.. గూగుల్‌, మెటాకు ఈడీ నోటీసులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2025
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లకు సంబంధించిన కేసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా, టెక్నాలజీ రంగంలోని ప్రముఖ కంపెనీలైన గూగుల్, మెటాలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. శనివారం ఈ నోటీసులను జారీ చేసిన ఈడీ, * జూలై 21న ఈ సంస్థల ప్రతినిధులు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలు, ప్రమోషన్లు, ఫండింగ్‌కు సంబంధించి గూగుల్, మెటా పాత్రపై విచారణ జరిపేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఈ పరిణామాలు ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యాపారానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా తీవ్రత పెరిగిందని సూచిస్తున్నాయి.