Page Loader
Balineni Srinivasa Reddy: 'మళ్లీ వస్తా.. వారి అంతు తేలుస్తా'.. బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'మళ్లీ వస్తా.. వారి అంతు తేలుస్తా'.. బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Balineni Srinivasa Reddy: 'మళ్లీ వస్తా.. వారి అంతు తేలుస్తా'.. బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2023
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పత్రికల్లో తనపై అసత్య కథనాలను ప్రచురించడంపై ఆయన మండిపడ్డాడు. సాధారణంగా తాను ఎవరికి జోలికి వెళ్లనని, కక్ష్య సాధింపులకు దూరంగా ఉంటానని, అయితే ఈసారి ఎన్నికల్లో గెలిస్తే ఆ ఇద్దరిని వదలని హెచ్చరించాడు. కచ్చితంగా వాళ్ల అంతు చూస్తానని, ఈ విషయంలో వెనక్కి తగ్గనని పేర్కొన్నాడు. మండువవారిపాలెం భూముల విషయంలో తాను మేయర్‌ను తిట్టాననడం అవాస్తవమని చెప్పారు.

Details

ఈనెల 22న ఒంగోలులో సామాజిక సాధికార బస్సు యాత్ర

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచు సందర్భంగా ACA వారు తెర ఏర్పాటు చేశారని, అయితే తాను అభిమానుల కోసం కుర్చీలు, స్నాక్స్ సొంత ఖర్చుతో ఏర్పాటు చేశానన్నారు. ఇక తన ఫోటోలతో అక్కడ ఫ్లెక్సీలు వేయిస్తే తప్పేంటి అని బాలినేని ప్రశ్నించాడు. ఒంగోలు భూ కుంభకోణం కేసుల్లో పోలీసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని, తానేం చేసినా ఉక్రోషం పట్టలేక మాజీ ఎమ్మెల్యే జనార్దన్ అనవసర విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఈనెల 22న ఒంగోలులో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుందని, దీన్ని వైసీసీ నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలని ఆయన కోరారు.