NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pranay Case Judgement: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు.. ఒకరికి ఉరిశిక్ష, ఆరుగురికి జీవితఖైదు 
    తదుపరి వార్తా కథనం
    Pranay Case Judgement: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు.. ఒకరికి ఉరిశిక్ష, ఆరుగురికి జీవితఖైదు 
    ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు.. ఒకరికి ఉరిశిక్ష, ఆరుగురికి జీవితఖైదు

    Pranay Case Judgement: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు.. ఒకరికి ఉరిశిక్ష, ఆరుగురికి జీవితఖైదు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 10, 2025
    01:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో సంచలనంగా మారిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది.

    ఈ కేసులో ఏ-2 నిందితుడు శుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించగా, మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించింది.

    మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్‌లు పాఠశాల రోజుల నుంచే ప్రేమించుకుని, 2018లో కులాంతర వివాహం చేసుకున్నారు.

    అయితే తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో, అమృత తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి, 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్‌ను అత్యంత క్రూరంగా హత్య చేయించాడు.

    ఈ ఘటన అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

    Details

    ప్రధాన నిందితుడు ఆత్మహత్య

    ఈ హత్యపై ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు, మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు ఎనిమిది మందిపై 302, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.

    2019 జూన్ 12న 1600 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. దాదాపు 5 సంవత్సరాలు 9 నెలల పాటు విచారణ కొనసాగిన అనంతరం, న్యాయస్థానం సాక్ష్యాలు, పోస్టుమార్టం నివేదికలు, సైంటిఫిక్ ఎవిడెన్స్‌లను పరిశీలించి తుది తీర్పును వెలువరించింది.

    అయితే, ఈ కేసు విచారణ సమయంలోనే ప్రధాన నిందితుడు మారుతీరావు తీవ్ర డిప్రెషన్‌కు గురై, 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మిర్యాలగూడ
    తెలంగాణ

    తాజా

    civil aviation: భారత్, పాక్ వార్ టెన్షన్.. పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు విమానాశ్రయం
    BCCI: ధర్మశాల నుంచి ఆటగాళ్లను ప్రత్యేక రైలు ద్వారా తరలించనున్న బీసీసీఐ బీసీసీఐ
    Marco rubio: 'ఉద్రిక్తతల నివారణకు ప్రయత్నించండి': భారత్‌, పాకిస్థాన్‌కు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తా: మార్కో రూబియో అమెరికా
    Pakistan: ఎఫ్-16 పాకిస్తాన్ పైలట్‌ పట్టుకున్ననిఘా వర్గాలు రాజస్థాన్

    మిర్యాలగూడ

    Telagana Elections 2023 : మిర్యాలగూడలో ద్విముఖ పోరు.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో పైచేయి ఎవరిది?  కాంగ్రెస్

    తెలంగాణ

    Ration Cards: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు షాకింగ్ న్యూస్! మంజూరు ప్రక్రియలో జాప్యం? ఇండియా
    SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఆపరేషన్‌లో కార్మికుల జాడ కోసం అత్యాధునిక జీపీఆర్‌ భారతదేశం
    TG Non Local: విద్యాశాఖ కీలక నిర్ణయం.. తెలంగాణలో నాన్-లోకల్ కోటా రద్దు! ఆంధ్రప్రదేశ్
    TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చిల్లర కోసం ఇక బాధపడాల్సిన పనిలేదు! ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025